అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలి

అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలి : టీజీవీపీ డిమాండ్

తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర టీజీవీపీ ఆర్గనైజేషన్ సెక్రటరీ మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు కొట్టురి ప్రవీణ్ కుమార్ నిర్మల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి పర్మిషన్లు లేకుండా కనీస మౌలిక వసతులు లేని,విచ్చలవిడిగా కళాశాలలకు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. పేద విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కళాశాలలపై చర్యలు తీసుకోవాలి. అక్రమంగా వెలసిన కళాశాలను మూసివేయాలని టీజీవిపీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ సాయి చరణ్, కో కన్వీనర్ జాదవ్ మిథున్ గణేష్,రామకృష్ణ ఎస్.కే అప్రోజ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment