తెలంగాణ సిద్ధాంత కర్త.ఆచార్య జయశంకర్ కు ఘననివాలి
భద్రాచలం.తెలంగాణ సిద్ధాంత కర్త. తొలి దశ.మలిదశ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి తెలంగాణ సాధనకు మూలస్తంభం గా నిలబడ్డ వ్యక్తి. గొప్ప మేధావి కొత్తపల్లి జయశంకర్ సార్ అని బి ఆర్ ఎస్ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్. మానే రామకృష్ణ తెలిపారు.మంగళవారం స్థానిక అంబేద్కర్ సెంటర్ లో బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు ఆకోజు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రావులపల్లి. మానే మాట్లాడుతూ సాధించిన తెలంగాణ లో ఆ ఫలాలు ప్రజాలందరికి దక్కలాని చివరి వరకు తెలంగాణ కోసం. నిలబడ్డ గొప్ప శిఖరం జయశంకర్ సర్ అని తెలిపారు..ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు కోలా రాజు.ఐనాల రామకృష్ణ. లంకపల్లి విశ్వనాధ్.బత్తుల నర్సింహులు. దానియేలు ప్రదీప్. యువరాజు.చిట్టిమల్ల అనిల్ తదితరులు పాల్గొన్నారు.