5.51 లక్షలకు గణపతి లడ్డూను కైవసం చేసుకున్న చింతకింది మీనా మహేందర్ గౌడ్

*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ సెప్టెంబర్ 16*

శేరిలింగంపల్లి మండలకేంద్రంలోని ఆదర్శనగర్ రోడ్డు నెంబరు-2 లోని ఎస్పిరెసిడెన్సిలో
ప్రతిష్టించిన వినాయకుడి లడ్డును వేలం పాటను తొమ్మిదవరోజు ఆదివారం నాడు నిర్వహించారు.
5లక్ష 51 వెయ్యి రూపాయలకు
చింతకింది మీనా మహెందర్ గౌడ్ కైవసం చేసుకున్నారు.
వేలం పాటలో చింతకింది అమృత డాకయ్య గౌడ్ కుమారుడు మహేందర్ గౌడ్ వేలంపాటలో లడ్డును పాడి దక్కించుకున్నారు.
గణేషుడి నవరాత్రి ఉత్సవాలలోభాగంగా
తొమ్మిదిరోజులు భక్తి శ్రద్ధలతో భజనలతో నిత్యాన్నదానాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా పూజలందుకొన్న మహిమగల్గిన
“ఎస్పిరెసిడెన్సి గణనాథుడి లడ్డు” ను చింతకింది దంపతులు కైవసం చేస్కోవడం వరుసగా ఇది మూడోవసారి.గతేడాది 2023లో
₹1.51లక్షలకు,
2022లో ₹2.21లక్షలకు వేలం పాటలో చింతకింది మీనా మహెందర్ గౌడ్ దంపతులు దక్కించుకున్న తెలిసిందే.వరుసగా మూడో సారి హ్యాట్రిక్ గా మహిమగల ఎస్పిరెసిడెన్సి లడ్డు తమకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని చింతకింది మహెందర్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.
వేలం పాటలో లడ్డు కైవసం చేసుకోవడానికి పలువురు పోటీ పడినప్పటికీ చివరికి మహేందర్ గౌడ్ కే ఆ ప్రతిష్టాత్మకమైన గణేషుడి మహాప్రసాదమైన “ఎస్పిరెసిడెన్సి
లడ్డు “ దక్కింది.
ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు బెజగం కేశవులు,
మరాటి నర్సింహులు,గంగాధర సంతోష్ ,వేణుగోపాలచారి, శ్రావణ్ చారి,బాలాజీ,
రత్నాకర్రెడ్డి,జనార్ధన్,రాజశేఖర్రెడ్డి,అంశపాల్రెడ్డి,లింగారెడ్డి
,విజయలక్ష్మి, బాలమణి,నిర్మల, అపార్టుమెంటు వాసులు,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment