నీటి శుద్ధికరణ యంత్రాన్ని బహుకరించిన స్ట్రీట్ క్రాస్ సెల్ఫ్ ఆర్గనైజేషన్

నీటిశుద్దీకరణ యంత్రాన్ని బహుకరించిన స్ట్రీట్ కాస్ సెల్ఫ్ ఆర్గనైజేషన్

చార్మినార్ ఎక్స్ ప్రెస్: అక్టోబర్ 18, పెద్ద శంకరంపేట్.
పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు స్ట్రీట్ కాస్ సెల్ఫ్ ఆర్గనైజేషన్ సంస్థ వాళ్ళు నీటిశుద్దీకరణ యంత్రాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన మండల విద్యాధికారి డి వెంకటేశం మాట్లాడుతూ నీటిశుద్దీకరణ యంత్రం ద్వారా పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులకు శుభ్రమైన త్రాగునీరు అందుబాటులోకి వచ్చిందని, దీనిని విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరని, ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలి అని సంస్థ యెక్క ప్రతినిధులను కోరి, వారికీ అభినందనలు తెలియజేశారు. నీటిశుద్దీకరణ యంత్ర ప్రారంభోత్సవానికి మండల విద్యాధికారి డి వెంకటేశంతో పాటు సంస్థ ప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.రాజేశ్వర్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version