వర్గీకరణను వ్యతిరేకిస్తూ.మాల మహానాడు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం

వర్గీకరణను వ్యతిరేకిస్తూ.మాల మహానాడు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం

భద్రాచలం,ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాలల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుటకు కొత్తగూడెంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా నాయకులు అల్లాడి.పాలరాజు అధ్యక్షత వహించగా ముఖ్య నాయకులు మద్దెల. శివకుమార్ హాజరవగా ఈ సన్నాహక సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నియోజకవర్గ ఎస్సీ వర్గీకరణ ముఖ్య నాయకుల సలహాలు, సూచనల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు అధ్యక్షులు పూల. రవీందర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధమవుటకు జిల్లాలో ఉన్నటువంటి మాల సోదర సోదరీమణులు అందరినీ చైతన్యపరచుటకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జిల్లాలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మాల సోదర సోదరీమణులందరికీ కూడా జిల్లా కేంద్రంలో ఈనెల సెప్టెంబర్ 29 ఆదివారం మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాలల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకొనుటకు తేదీని మరియు స్థలాన్ని సమిష్టి నిర్ణయంతో ఏకాభిప్రాయానికి రావడం జరిగిందని,ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మాల ఎమ్మెల్యేలు మరియు ఎంపీలను మరియు మాల మేధావులను ముఖ్య అతిథులుగా పిలవాలని నిర్ణయించడం జరిగింది.అని ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మద్దతు ఇచ్చేటువంటి అన్ని వర్గాలను కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఈ సభ వేదిక నుండి మాలల సత్తా నిరూపిస్తామని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాలు కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లందు అశ్వరావుపేట, పినపాక నుండి ముఖ్య నాయకులు ఆన్ తోటి. పాల్,పగిడిపల్లి. శ్రీకాంత్,పుట్టి. శ్రీనివాస్, సారిక నరసింహ,పుష్పలత, కల్పన, జట్టి. మోహన్, బి.నరేష్,డి. రామారావు, ఇల్లంగి.తిరుపతి బుడిబుడి. ప్రభాకర్, పోతురాజు. రామారావు,బుడిబుడి. ప్రతాప్, కొండల్, పుట్టి. రవి, డేగల.వంశీ, డేగల. పద్మారావు, శివ, ఎన్. వెంకటేష్,ఈశ్వరయ్య, రాజేశ్వరరావు కృష్ణ, పి ఎన్ మూర్తి తదితర మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment