ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
రెండు దశాబ్దాల
తర్వాత పూర్వ విద్యార్థులందరూ ఒకే వేదికపై వచ్చి ఆదివారం కలిశారు.మద్దిరాల మండలం గుమ్మడివెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-02 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులందరూ కలిసి జిల్లా కేంద్రంలోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంను ఘనంగా నిర్వహించారు.నాటి విద్యార్థులందరూ ఒక చోటికి చేరి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.తమ స్నేహానుబంధం, నాటి గురువులతో తమకున్న అనుబంధాన్ని, విద్యార్థి దశలో తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకొని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం తమకు విద్యాబుద్ధులు చెప్పి ప్రయోజకులను చేసిన గురువులను ఘనంగా సన్మానించారు.అనంతరం వినోద కార్యక్రమాలతో ఉల్లాసంగా గడిపారు.ఈ వేడుకల్లో నాటి ఉపాధ్యాయులు పబ్బతి వెంకటేశ్వర్లు, బి.హనుమంతరావు, కె.సత్తయ్య, ఆర్.శ్రీధర్ రెడ్డి, ఎం.ప్రకాష్, రామచంద్రయ్య, వెంకన్న, అంజయ్య, కిరణ్, పూర్వ విద్యార్థులు కోట దామోదర్, బొలిశెట్టి శ్రీకాంత్, రుద్ర శ్రీనివాస్,గుణగంటి శ్రీనివాస్,సురేందర్ తదితరులు పాల్గొన్నారు.