తల్లి కొడుకుల ప్రాణాలకు కారకులైన వారిపై కేసు నమోదు..

తల్లి కొడుకుల ప్రాణాలకు కారకులైన వారిపై కేసు నమోదు..
చార్మినార్ ఎక్స్ ప్రెస్ సంగారెడ్డి జిల్లా, 28, నవంబర్

సంగారెడ్డి జిల్లా అందోలు మండలం చింతకుంట మంజీరా నదిలో దూకి తల్లి, కొడుకులు అత్మహత్యకు పాల్పడిన ఘటనలో కారకులైన గ్రామస్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు జోగిపేట సిఐ అనిల్ కుమార్ ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మంమృతుని తండ్రి యాదయ్య జోగిపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 24వ తేదీన (ఆదివారం) చింతకుంటకు చెందిన చాంద్‌పాషా ఇంట్లో జరిగిన విందుకు సంగారెడ్డికి చెందిన బంధువులు టాటా ఏసీ ఆటోలో హాజరుకాగా, అదే రోజు రాత్రి ఆటో కనిపించలేదు. గ్రామానికి చెందిన వడ్ల శ్యామ్‌ ఆటోను ఎత్తుకేళ్లాడని సోమవారం చింతకుంట గ్రామ పెద్దలకు తెలియజేశారు. దీంతో గ్రామ పెద్దలు మంగళవారం వడ్ల శ్యామ్‌ కుటుంబీకులను పిలిపించి పంచాయితీ నిర్వహించారు. ఆటోను చోరీకి పాల్పడినందుకు గాను గ్రామ పెద్దలు రూ.5 లక్షల జరిమానాను చెల్లించాలంటూ వడ్ల శ్యామ్, అతని కుటుంబీకులపై ఒత్తిడి తీసుకొచ్చారని పెర్కోన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment