వరదప్రవాహంలో కొట్టుకపోయిన కారు..
మహబూబాబాద్(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జి పై నుండి వెలుతున్న వరదనీరు. ఆ రోడ్డు పై కారులో హైదరాబాద్ విమనాశ్రయానికి బయలుదేరిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతుర్లు పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అదుపుతప్పి నీటిలోకి పోయిన కారు.తమ కారు వాగులోకి పోయిందని, మా మెడవరకు నీరు వచ్చిందంటూ బందువులకు పోన్ లు చేసిన నూనావత్ మోతిలాల్, నూనావత్ అశ్విని.
ప్రస్తుతం వారి పోన్ లు స్విచ్చాఫ్ రావడం.. కారు కూడా కనిపించకపోవడంతో ఆందోళనలో కుటుంబసభ్యులు, బందువులు.