పోలీస్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణి

పోలీస్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణి

 

పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా తిర్యానీ మండలంలోని గోవేన గ్రామంలో ఆదివాసీలకు అసిఫాబాద్ ఎఎస్పి ఎస్ చిత్తరంజన్ ఐపిఎస్ దుప్పట్లు పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్ ఆదేశాల మేరకు అసిఫాబాద్ ఎఎస్పి ఎస్ చిత్తరంజన్ ఐపిఎస్ గురువారం తిర్యాని మండలంలోని గోవేనా గ్రామంలో ఆదివాసులకు ఉచితంగా 200 దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ గంజాయి యువత యొక్క భవిష్యత్తును నాశనం చేస్తుందని, మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలను సేవించడం ద్వారా సమాజంలోని చెడును ప్రారంభించినట్లు అవుతుంది అని , దానిని అరికట్టడానికి తల్లిదండ్రులు , పెద్దలు కృషిచేయాలని సూచించారు. దాదాపు 200 బ్లాంకెట్లను ఆదివాసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. శీతాకాలం నందు ఈ బ్లాంకెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని పాల్గొన్న ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో రెబ్బెన సిఐ బుద్దే స్వామి, తిర్యాని ఎస్ఐ శ్రీకాంత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment