వరద బాధితులకు చిన్నారి సహాయం
చార్మినార్ ఎక్స్ ప్రెస్, నిర్మల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 06,
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లోని గోసంపల్లె గ్రామానికి చెందిన చిన్నారి బి. శన్వికా వంజరి తాను దాచుకున్న కిడ్డీ బ్యాంక్ నుండి వరద బాధితుల సహాయానికి తెలంగాణ గవర్నమెంట్ కి 2000 రూపాయలు, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి 1500 రూపాయలు ఫోన్ పే ద్వారా పంపించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారి ను గ్రామస్తులు అభినందించారు.