*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ సెప్టెంబర్ 18*
శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లోని హుడ ఫేస్ 2 లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఊరిటీ వెంకట్రావ్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ శివ శక్తి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద మంగళవారం నాడు లడ్డు వేలంపాటను నిర్వహించారు ఇ వేలంపాటలో మొదటి లడ్డును ఎస్ఎల్ఎన్ కంపెనీ యజమాని డీ సుబ్బారావు 4.21లకు స్వంతం చేసుకోగా రెండవ లడ్డును శ్రీ శివ శక్తి యూత్ సభ్యుడు అభిరామ్ సాయి 2.25 వేలకు స్వంతం చేసికోవడం జరిగింది ఈ సందర్భంగా ఊరిటీ వెంకట్రావ్ మాట్లాడుతూ చందానగర్ లో తన ఇంటి వద్ద 2019 ఒక చిన్న వినాయకుడితో మొదలు పెట్టి నేడు భారీ వినాయకుడిని ఏర్పాటు చేశాం అని అదే విధంగా నేటితో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందని మొదటి సంవత్సరం వేలల్లో పలికిన లడ్డు ఈరోజు లక్షల్లొ పలకడం ఎంతో ఆనందంగా ఉందని గత పదకొండు రోజులుగా నిత్య పూజలను అందుకున్న లడ్డు ను స్వంతం చేసుకున్న సుబ్బారావ్ .అభిరామ్ సాయి లకు శుభాకాంక్షలు తెలియజేశారు