2025 ఎస్ టి యు టి ఎస్ క్యాలెండర్ ఆవిష్కరించిన జడ్పిహెచ్ఎస్ కడ్పల్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ చౌకి వెంకటేశం
సిర్గాపూర్ మండల శాఖ అధ్యక్షులు శ్రీ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి శ్రీ రoగ్ లాల్ గార్ల ఆధ్వర్యంలో క్యాలెండర్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ కడ్పల్ పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకటేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రాథోడ్ గారల చేతుల మీదుగా జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించబడి. తదనంతరం సంఘ డైరీ, జీవోల పుస్తకాన్ని రాష్ట్ర కార్యదర్శి జీవన్ రాథోడ్ తో కలిసి అందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకటేశం గారు మాట్లాడుతూ … ఎస్టియు పోరాటం వల్ల ఉపాధ్యాయ లోకానికి అనేక ప్రయోజనాలు చేకూరాలని అన్నారు. అలాగే గతంలో ఎస్టియు క్యాలెండర్ పై ఒక ప్రత్యేకమైన ఆకర్షణ నియమైనా డ్రాయింగ్ ఉండేదని గుర్తు చేసుకున్నారు. అలాగే ప్రతిసారి జీవోల పుస్తకాన్ని అనుబంధంగా అందించడం గొప్ప విషయం అని కొనియాడారు. ఈ క్యాలెండర్ పంపిణీ కార్యక్రమంలో కల్హేర్ మండల అధ్యక్షులు రామారావు, మనూరు మండల ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ ఉపాధ్యాయులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.