స్వయంభు పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి

స్వయంభు పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి

 

దంతాలపల్లి మండలంలోని పెద్ద ముప్పారం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం 170 సంవత్సరాల దేవాలయం అని ఆలయ అర్చకులు చక్రవర్తులు వరదరాజా చార్యులు తెలిపారు.
గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత స్వయంభు శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఉదయం 7:30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉత్తర ద్వారా దర్శనం నిర్వహించడం జరిగింది అని ఇట్టి కార్యక్రమం ఆలయ అర్చకులు చక్రవర్తుల వరదరాజాచార్యులు గ్రామ భక్తుల ఆద్వర్యంలో స్వామివారికి సేవకాలం అర్చన తదితర కార్యక్రమాలు విశేషంగా చేయడం జరిగింది ,ఇక్కడ స్వామి వారు స్వయంగా వెలసినాడు కాబట్టి భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా గ్రామస్తులు స్వామివారిని దర్శించుకుంటారు.
ఈ దేవాలయంలో స్వామివారు వెలసి దాదాపుగా 170 సంవత్సరాలు అవుతుంది ఆలయ పురోహితులు తెలిపారు
ఇట్టి కార్యక్రమంలో గ్రామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

Join WhatsApp

Join Now

Leave a Comment