ప్రభుత్వ వైద్యశాలలో తల్లిపాల వారోత్సవాలు
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఐసిడిఎస్ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ శిల్పిని హాజరై మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు మొదటి టీకా లాగా పనిచేస్తుంది అన్నారు తల్లి ఆరు నెలల వరకు బిడ్డకు పాలు ఇవ్వాలి బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాలి తల్లి బిడ్డకు పాలు ఇచ్చే విధంగా కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలి బిడ్డ రోగాల బారిన పడకుండా ఉండాలంటే తల్లిపాలు శ్రేయస్కారమని అన్నారు ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ హైమావతి సూపర్వైజర్ కరుణ వనజ షమీంబి యాకూబ్ పాషా బేగం అంగన్వాడి టీచర్ సునీత స్వర్ణ ఆశాలు కలమ్మ తదితరులు పాల్గొన్నారు.