నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు తప్పని సరిగా వేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు
శుక్రవారం కలక్టరేట్ కార్యాలయంలోని కలెక్టర్ సమావేశపు హాలులో నేషనల్ డి వార్మింగ్ డే జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటి సన్నాహక సమావేశంలో జిల్లా కలెక్టర్ తెజస్ నంద్ లాల్ పవార్ పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 10న అన్ని స్కూల్స్, సంక్షేమ హాస్టళ్లలలో మాత్రలు వేయించాలి. తీసుకొని వారికి తిరిగి 17 వ తేదీన అల్బెండజోల్ మాత్రలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 2,0,1560 మంది పిల్లలు గుర్తించడం జరిగిందని జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్యాధికారి నుండి మొదలు కొని ఆశా సిబ్బంది వరకు డి వార్మింగ్ డే లో భాగస్వాములు కావాలని ఆదేశించారు. చిన్నారులకు వైద్య సిబ్బంది పర్యవేక్షణ లో మాత్రమే మాత్రలు ఇవ్వాలని పేర్కొన్నారు.
పంచాయతీ అధికారులు అల్బెండజోల్ మాత్రల వాడకం గురించి విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు అందించాలని సూచించారు. గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన పిల్లలకు, వివిధ కారణాల వల్ల ఇంటి వద్ద ఉన్న పిల్లలను గుర్తించి మాత్రలు అందించాలని తెలిపారు.1 సం॥ పిల్లలకు1/2( ఆఫ్ టాబ్లెట్) 2నుండి 3 సంవత్సరాలలోపు పిల్లలకు ట్యాబ్లెట్లును పిండి చేసి అందించాలని, 3 నుండి 19 సంవత్సరాల పిల్లలకు నేరుగా ట్యాబ్లెట్లు అందించాలని తెలిపారు. కడుపులో నులిపురుగుల ఉండటం వల్ల తిన్న ఆహారం వంటబట్టక పిల్లలు రక్త్ హీనతను గురవుతారని మాత్రలు వేసుకోవడం వల్ల నులిపురుగుల చనిపోతాయని, ఆహారం మంచిగా జీర్ణం అయి పిల్లల ఎదుగుదల బావుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి ఎం అండ్ హెచ్ ఓ కోటాచలం డిఇఓ అశోక్ డి డబ్ల్యూ నరసింహారావు ఏంటి ఈ పి డాక్టర్ నజియా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ కోదాడ జయమనోరి డి ఎస్ సి డి ఓ కే లత ఇండస్ట్రియల్ సీతారాం పిడి మెప్మా 3 రేణుక మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి హుజూర్నగర్ రమాదేవి కోదాడ యాకుబ్ పాషా నేరేడుచర్ల కమిషనర్లు పాల్గొన్నారు.