నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని మంచి ఫలితాలు సాధించాలి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని మంచి ఫలితాలు సాధించాలి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

 

 

పదో తరగతి విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు నూతన సాంకేతికతనుఅందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం మక్తల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థినీ విద్యార్థులకు పదవ తరగతి పాఠాలు సులభంగా అర్థమయ్యేలా టూడీ, త్రీడీ యానిమేషన్, క్యూఆర్ కోడ్ కలిగిన డిజిటల్ స్టడి మెటీరియల్ ను మక్తల్ ఎమ్మెల్యే డా. వాకిటి శ్రీహరి సహకారంతో రూపొందించగా 

ఆ స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి నారాయణ పేట జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి, జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులుతో కలిసి స్టడీ మెటీరియల్ బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలలో పదవ తరగతి చదివే విద్యార్థినీ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించిన స్టడీ మెటీరియల్స్ ను స్థానిక ఎమ్మెల్యే తన సొంత డబ్బులతో తయారు చేయడం ఏంతో గొప్ప విషయమని అన్నారు.నూతన సాంకేతికతో తయారుచేసిన స్టడీ మెటీరియల్ ను ప్రతీ విద్యార్థి ఉపయోగించుకుని పదో తరగతిలో మాంచి మార్కులు సాధించి, మెటీరియల్ అందించిన స్థానిక ఎమ్మెల్యేకు, తల్లిదండ్రులకు, పుట్టిన ఊరికి, చదివిన పాఠశాలకు, మరీ ముఖ్యంగా నారాయణపేట జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. గతేడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లా ర్యాంకు రాష్ట్రంలోనే పదో స్థానంలో నిలించిందని, ఈ సారి కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలలలో వందకు వందశాతం ఉత్తీర్ణత సాధించి జిల్లా ర్యాంకును మరింత పై స్థాయికి పెంచాలని కలెక్టర్ సూచించారు. అయితే కార్యక్రమ అనంతరం స్థానిక ఎమ్మెల్యే పదో తరగతి విద్యార్థులకు భోజన వసతిని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా స్వయంగా ఎమ్మెల్యేనే విద్యార్థులకు భోజనాన్ని వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఈఓ అనిల్ గౌడ్, బి కే ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీj నియోజకర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment