ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరుక్ నగర్ మండలం మొగలిగిద్ద గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి స్వయంగా గురువారం పర్యవేక్షించారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి సభా ప్రాంగణం, తదితర వేదిక ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక్కడ ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశించారు