మహాత్మా గాంధీ చిత్రపటాని కీ పూలమాలవేసి నివాళులు అర్పించిన జిల్లా అదనపు ఎస్పి ప్రభాకర్
జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయం లో గురువారం జాతిపిత మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు ఎస్పీ ఆర్ ప్రభాకర్ రావు గాంధీ చిత్రపటానికి పూలు వేసి ,నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలు స్మరించుకుంటూ రెండు నిమిషాలు జిల్లా పోలీస్ అధికారులు , సిబ్బందితో మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ ఏఓ శ్రీనివాసరెడ్డి, ఎస్సైలు, ఆర్ఎస్ఐలు, స్పెషల్ పార్టీ,డిపిఓ, ఐటీ కోర్, డి.సి.ఆర్బి , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.