నిత్యవసర సరుకుల పంపిణీ
ఆర్జీ-3 ఓసిపి2 లో పనిచేస్తున్న ఐఎన్టియుసి కేంద్ర కార్యదర్శి, అర్జి-3 ఏరియా జిఎం కమిటీ సభ్యులు ,లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ సభ్యులు ఎల్లంకి రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని కల్వచర్ల గ్రామంలో నివాసం ఉంటున్న నిరుపేద మహిళకు నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. అనంతరం ఎల్లంకి రామారావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ మరియు నెలకు రూ.వంద – ఆపదలో అండ అనే స్ఫూర్తితో నిర్వహిస్తున్న సింగరేణి యువ బలగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని, మధురమైన లక్షణాలను ఒక మంచి జ్ఞాపకంగా అందివ్వడానికి కృషి చేస్తున్న యువ బలగం సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ తన పుట్టినరోజు సందర్భంగా కల్వచర్ల గ్రామంలో నివాసం ఉంటున్న నిరుపేద మహిళకు ఒక నెలకు సరిపడ నిత్యవసర సరుకులు, కూరగాయలు అందివ్వడం చాలా సంతోషం గా ఉంది అన్ని తెలిపారు.మీరు కూడా మీ మధురమైన క్షణాలను సాటి వారికి సహాయం చేసి మధురమైన జ్ఞాపకాలుగా మార్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డైరెక్టర్ మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి, మేకల మారుతి యాదవ్ సింగరేణి యువ బలగం సభ్యులు మొత్తుకురి రాజు, తాటి సదన్ గౌడ్ , తొట్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.