7న తహసిల్దార్   కార్యాలయం ముందు ధర్నా  వ్యక్తిగత దరఖాస్తులతో తరలిరావాలి..! -సిపిఐ(ఎం)జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాల వీరయ్య

7న తహసిల్దార్ 

 కార్యాలయం ముందు ధర్నా 

 

వ్యక్తిగత దరఖాస్తులతో తరలిరావాలి..!

 

-సిపిఐ(ఎం)జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాల వీరయ్య

 

 ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనవరి 7న తహసిల్దార్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు లబ్ధిదారులు వ్యక్తిగత దరఖాస్తులతో తరలిరావాలని సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాల వీరయ్య పిలుపునిచ్చారు. ఆదివారం మరిపెడ మండల కేంద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో సిపిఐ (ఎం) జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అలవాల వీరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 48 గ్రామపంచాయతీలల్లో 20 గ్రామాలలో, మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని ఐదు వార్డులలో సిపిఐ(ఎం) బృందం

8 టీంల ద్వారా సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఈ సర్వేలో కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చినట్లు వాటి వివరాలను ఆయన వెల్లడించారు. మండలంలో వీరారం, ఉల్లెపల్లి, తాళ్ల ఉకల్, తదితర గ్రామాలలో దళితుల కు పట్టాలు ఇచ్చారు కానీ అట్టి భూమి ఎక్కడుందో ఇంతవరకు ప్రభుత్వాలు చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా వ్యక్తిగత దరఖాస్తులతో తాహాసిల్దార్ కార్యాలయం ముందుకు ధర్నాకు రావాలని ఆయన దళితులకు పిలుపునిచ్చారు. అంతేగాక ప్రజాపాలన లో ప్రజలు గ్యాస్, విద్యుత్తు, ఆసరా పింఛన్లు, కౌలు రైతులు, తదితర సమస్యలపై ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొని సంవత్సరం పూర్తయిందని తెలిపారు. కానీ ఇందులో తండాలలో ఎస్సీ ఎస్టీ బీసీ అట్టడుగు వర్గాల ప్రజలకు ఇంకా కొంతమందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అమలు కావడం లేదన్నారు. విద్యుత్ అధికారులకు, గ్యాస్ ఏజెన్సీల వద్ద ఫిర్యాదు చేసిన అధికారులకు, ఇతర డిపార్ట్మెంట్ల అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. మున్సిపాలిటీ పరిధిలోని మైనార్టీ కాలనీ, బొత్తల తండ, కుణ్య తండా, మందుల కాలనీ, ఇందిరానగర్, తదితర ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తేలింది అన్నారు. నీళ్లు వచ్చిన పైపులు లీకేజీలు బురద నీరు వస్తుందని పేర్కొన్నారు. పట్టణ నడిబొడ్డున సెంటర్ లైట్లు సక్రమంగా వెలగటం లేదని ఈ లైట్లు పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రయోజనం లేదన్నారు. మండలంలోగ్రామపంచాయతీలకు నిధులు లేక పంచాయతీ కార్యదర్శులు విద్యుత్తు లైట్లు వెలిగించలేక చేతులు ఎత్తేసారని ఆరోపించారు.

 కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతగానో ఎదురు చూసామన్నారు.

 అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేలు జరుగుతున్నప్పటికీ అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే ఇడ్లీ ఇవ్వాలని సిపిఐ(ఎం) డిమాండ్ చేస్తుందన్నారు. దివ్యాంగులకు ఇటీవల కాలంలో సదరం సర్టిఫికెట్ పేరుతో పర్సంటేజీలు తగ్గిస్తున్నారని వికలాంగులకు పింఛన్లు రాకుండా ఆగిపోయినట్లు వారు మాకు ఆవేదన వినిపించాయన్నారు. దీని ఫలితంగా పింఛని రాని పరిస్థితి వికలాంగులకు ఉందని వారంతా వ్యక్తిగత దరఖాస్తులతో తాహాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు రావటానికి సిద్ధంగా ఉన్నారని వారంతా రావాలని వారికి విజ్ఞప్తి చేశారు. కౌలు రైతులను ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి గత అనేక సందర్భాల్లో చెప్పారని నిన్నటి క్యాబినెట్ సమావేశంలో కౌలు రైతుల సమస్య చర్చించకపోవడం శోచనీయమన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. లేనియెడల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని మరింతగా ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్, పార్టీ ఆర్గనైజర్ బాణాల రాజయ్య, మండల కమిటీ నాయకులు జిన్న లచ్చన్న, కొండ ఉప్పలయ్య, ఇతర ప్రజా సంఘాల నాయకులు నవిలే వెంకన్న, వడ్లకొండ ఉప్పలయ్య, అనపర్తి ఉపేందర్, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version