సూర్యాపేటలో పరువు హత్య 

 సూర్యాపేటలో పరువు హత్య 

 సూర్యాపేట లో పరువు హత్య కలకలం రేపింది. ఆదివారం ఆర్ధరాత్రి నగర శివారులోని మూసీ కాల్వ కట్టపై ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. 

మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి అనే యువకుడు హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. యువకుడిని దుండగులు బండ రాళ్లతో మోదీ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడు మామిళ్లగడ్డకు చెందిన కృష్ణ,ఆరు నెలల కిందట భార్గవి అనే అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నాడు. చెల్లెలు భార్గవి కులాం తర వివాహం చేసుకోవడం ఆమె సోదరుడికి ఇష్టం లేదు. కృష్ణపై భార్గవి సోదరుడు పగతో రగిలిపోతున్నాడు. 

పలు హత్య కేసుల్లో కృష్ణ కీలక నిందితుడిగా ఉన్న కృష్ణ.. ఉన్నపళంగా హత్యకు గురకావడంతో అంతా అయోమయం నెలకొంది. కృష్ణది పరువు హత్యనా? లేదా పాత కక్షలే కారణమా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. 

కృష్ణను భార్గవి సోదరుడు ప్లాన్ ప్రకారం దారుణంగా హత్య చేసినట్లు తెలు స్తోంది. నిందితులు పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version