బైకు అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి.

బైకు అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన హవేలీ గణపురం మండలం ఫరీద్ పూర్ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని జక్కన్నపేటకు చెందిన జక్కని ప్రభాకర్ (23), మామిండ్ల మహేష్ (25) లు బైక్ పై మెదక్ వైపు నుండి వస్తుండగా అదుపుతప్పి పొలంలోకి దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో ప్రభాకర్ స్పాట్లులో మృతి చెందగా మహేష్ ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతులిద్దరిని మెదక్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు హవేలీ ఘనపురం పోలీసులు కేసు నమోదు వచ్చేసి దర్యాప్తు చేస్తున్నారు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment