పోయిన మొబైల్ దొరకబట్టిండ్రు..బయ్యారం పోలీసులకు సెల్యూట్.
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
గత ఆగష్టు 12 న స్మార్ట్ ఫోన్ పోగొట్టుకున్నాను అని బయ్యారం పోలీసు ఠాణా లో కల్తి కృష్ణ పిర్యాదు చేయడంతో సిఐ రవికుమార్,ఎస్ఐ తిరుపతి సిఈఐఆర్ టెక్నాలజీ ఉపయోగించి నెల రోజుల వ్యవధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ బాదితుడికి ఆదివారం పోలీసు అధికారులు అందజేశారు.దీనితో బాధితుడు పోగొట్టుకున్న ఫోన్ తెచ్చి పెట్టినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.