ఆర్ టి సి బస్ టూ వీలర్ బైక్ ఢీ.
ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు
-ఒకరి పరిస్థితి విషమం
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
బయ్యారం మండలంలోని నామలపాడు పంచాయతీ పరిధిలో ఇల్లందు మ హబూబాబాద్ ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు టూ వీలర్ వాహనం ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలు.108 ఆసుపత్రికి స్థానికులు తరలింపు.వారు తెలిపిన వివరాల ప్రకారం ఇల్లందు నుండి మహబూబాబాద్ కు టు వీలర్ వాహనంపై తాపీ మేస్త్రి పనులకు టూ వీలర్ పై పెద్దిరెడ్డి, భుక్యా నరేష్ వెళుతుండగా మహబూబాబాద్ నుండి భద్రాచలం వెలుతున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా ఢీ కొట్టడంతో టు వీలర్ వాహనం నడుపుతున్న పెద్ధిరెడ్డికి తీవ్రంగా గాయపడి కొన ఊపిరి తో ఉండగా భూక్యా నరేష్ తీవ్రంగా గాయపడటంతో 108 అంబులెన్స్ లో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది