సోలేం వారి కుంటలో మట్టి స్వాహా.. -పట్టించుకోని అధికారులు. -పర్యవేక్షణ శూన్యం.

సోలేం వారి కుంటలో మట్టి స్వాహా..

-పట్టించుకోని అధికారులు.

-పర్యవేక్షణ శూన్యం.

 బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)

 బయ్యారం మండల కేంద్రంలోని మండల రెవెన్యూ పరిధిలో అనుమతులు లేకుండా సోలెం వారికుంటలోని చేన్నంగల గడ్డ గ్రామ శివారు, రెవిన్యూ పరిధిలలో గత కొన్ని రోజులుగా అక్రమార్కులు జెసిబి యంత్రం తో మట్టి తవ్వకాలు చేస్తూ,గృహ నిర్మాణాలకు విక్రయాలు చేస్థున్నారు.మండలంలో కోళ్ల ఫారాలు,నూతనంగా నిర్మించే గృహ నిర్మాణలకు ట్రాక్టర్ లతో చేర వేస్థూ సొమ్ము చేసుకుంటున్నారు.పర్యవేక్షణ అధికారులు పర్యవేక్షణ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు చూడటంపై పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై తాహశీల్దార్ బి.విజయ వివరణ కోరగా మట్టి తొలకల గురించి ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదని,అలా పర్మిషన్ లేకుండా మట్టి తొలకాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment