రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకు దుర్మరణం
చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో సెప్టెంబర్ 10 ప్రతినిధి
మాసాయిపేట: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ క్రింద పడి తండ్రి కొడుకు దుర్మరణం చెందారు. కామారెడ్డి వైపు నుండి హైదరాబాద్ వైపు వస్తున్న లారీ ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులపై నుండి లారీ వెళ్ళింది. ఈ ప్రమాదంలో చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన దొంతు మల్లేశం అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, అతని తండ్రి బూదయ్య లారి క్రింద పడి రెండు ముక్కలయ్యాడు. ఈ హృదయ విధారకమైన ప్రమాద ఘటన చూపరులను కంటతడి పెట్టించింది. రెండు ముక్కలై కొన ఊపిరితో ఉన్న తండ్రి భూధయ్యను స్థానికులు తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న తూప్రాన్ డిఎస్పి సోమ వెంకట్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతుడికి భార్య, మూడు సంవత్సరాల లోపు కూతురు ఉన్నారు. కుటుంబంలో ఇద్దరు మగవాళ్ళు చనిపోవడంతో కుటింబికులు శోకసముద్రంలో మునిగిపోయారు.