శివంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….

*శివ్వంపేట మండలం రట్నాపూర్ తాండా మూల మలుపు బ్రిడ్జి వద్ద కారు ప్రమాదం*

*బ్రిడ్జి పై నుండి కాల్వలో పడిన కారు*

*సీతారాంపల్లి తాండా లో ఓ ఫంక్షన్ కి వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం*

*ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది*

*ప్రమాదస్థలిలోనే ఏడుగురు మృతి*

*మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు*

డ్రైవర్ నామ్ సింకు తీవ్ర గాయాలు

చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో అక్టోబర్ 16 ప్రతినిధి

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రాట్నాపూర్ తాండా మూల మలుపు బ్రిడ్జి వద్ద కారు అదుపు తప్పి కాల్వలో పడిన సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం వల్ల సంఘటన స్థలం రోదనలతో మిన్నంటాయి. కారు నడుపుతున్న నామ్ సింగ్ కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం నర్సాపూర్ ఆసుపత్రికి అక్కడినుంచి మల్లారెడ్డి మల్టి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కు తరలించారు. మృత దేహాలను తూప్రాన్ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి. భీమ్లా తండాకు చెందిన డ్రెవర్ నంసింగ్ కు తీవ్ర గాయాలు, అతని భార్య శాంతి (38), కుమార్తె మమత (అమ్ము 12) మృతి చెందారు. సీతారాం తండా కు చెందిన
అనిత (35), హిందూ (13), శ్రావణి (12) మృతి చెందారు. తలపల్లి తండాకు చెందిన శివరాం ( 56), దుర్గి (45) మృతి చెందారు. మృతదేహాలను తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా దగ్గర ఉండి పోస్ట్ మార్టం చేయించారు. మూడు తాండాలలు శోక సముద్రంలో మునిగిపోయాయి. సిఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, భాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే శివ్వంపేట ఎంపిపి కల్లూరి హరి కృష్ణ, జెడ్.పి.టి.సి పబ్బ మహేష్ గుప్త, గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రా గౌడ్, సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించి, తీవ్ర గాయాలు అయిన కుట్టంబ పెద్ద డ్రైవింగ్ చేస్తున్న నామ్ సింగ్ ను మెరుగైన వైద్యం కోసం మల్లారెడ్డి మల్టి సుపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించారు. అంతే కాకుండా తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని దగ్గరుండి పోస్ట్ మార్టం చేయించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్త, ఎంపిపి కల్లూరి హరి కృష్ణ, గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రా గౌడ్ లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రెషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తక్షణ సహాయం కింద ఆర్థిక సహాయం అందించాలని కోరారు. తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వారి వెంట నాయకులు రమణ, శ్రీహరి, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment