నారాయణఖేడ్
అకొల, సంగారెడ్డి (161) నేషనల్ రహదారి నిజాంపేట్ మండల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
రాంగ్ రూట్ లో వచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న లారీ
పిట్లం, వైపు నుండి పెద్ద శంకరంపేట్, వైపు ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా పెద్ద శంకరంపేట్, వైపు నుండి నాందేడ్ వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో సంభవించిన ప్రమాదం..
సంఘటన స్థలం వద్ద స్పాట్లో ఒకరు మృతి చెందగా ఇంకొకరు నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు.
మృతులు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్ రా, గ్రామానికి చెందిన సునీల్ (25) కామారెడ్డి జిల్లా మద్నూర్, మండలం నిరంగల్, గ్రామానికి చెందిన శ్రీనివాస్ (27) గా గుర్తింపు