రంగంలోకి సుపారి టార్గెట్ సి పి రంగనాథ్…..

రంగంలోకి సుపారి  టార్గెట్ సి పి రంగనాథ్…..

అక్రమార్కులకు కంటగింపుహైడ్రా టాస్క్‌ఫోర్స్‌ దూకుడుతో కుట్రకోణం

ఇంటెలిజెన్స్‌ వర్గాల హెచ్చరికలతో ఇంటివద్ద భద్రత పెంపు
రంగనాథ్‌కు వ్యక్తిగత భద్రత పెంచాలని ప్రజల వినతిఅక్రమ నిర్మాణాల కూల్చివేతలతో పెరిగిన శత్రువులు
విలువైన ఆస్తుల పరిరక్షణతో కక్షపూరిత చర్యలు?

చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో ఆగస్టు 28 ప్రతినిధి

చార్మినార్ ఎక్స్ప్రెస్ స్మార్ట్, గ్రేటర్ హైదరాబాద్ బ్యూరో – పోలీస్‌ ఉద్యోగం అంటేనే కత్తిమీద సాములా ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది… అందులోనూ ముక్కుసూటి తత్వంతో ముందుకు సాగే అధికారులపై డేగకళ్లతో వేటాడే శత్రువులు ఏ దిక్కునుంచి వస్తారో తెలియని పరిస్థితులుంటాయి… బెదిరింపులు.. బదిలీలు.. దాడులు ఇలా ఏ పంథాలో శత్రువు విరుచుకుపడతారో తెలియని విషమ పరిస్థితులు ఉన్నా మొక్కవోని గుండెధైర్యంతో అధికారులు ముందుకు సాగాల్సి ఉంటుంది… సరిగ్గా అలాంటి వ్యక్తిత్వం.. విధి నిర్వహణలో ఎవరినీ లెక్క చేయని మొండితనం.. ముక్కుసూటితత్వంతో ముందుకు సాగే హైదరాబాద్‌ డిజాస్ట ర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా) టాస్క్‌ఫోర్స్‌ కమిషనర్‌ ఏవీ.రంగనాథ్‌పై కూడా శత్రువులు కుట్రపూరిత చర్యలకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది… సుఫారీ గ్యాంగులతో దాడులకు సిద్ధం అవుతున్నట్లుఇంటెలిజెన్స్‌ వర్గాలు సైతం భావిస్తున్నాయి…

అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే కారణమా.?
అక్రమాలు ఏ స్థాయిలో జరిగినా, తన పరిధిలోకి వచ్చిన విషయాన్ని సీరియస్‌గా తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడమే తన కర్తవ్యం అన్నట్లుగా హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ముందుకు సాగుతారు. ఆ విషయంలో అవతల వ్యక్తులు అధికార పార్టీనా, లేక విపక్షమా అన్న తేడాలను ఆయన చూపరన్న విశ్వాసాన్ని రంగనాథ్‌ కల్పించారు. అటు వరంగల్‌ కార్పొరేటర్ల భూకబ్జాలు గానీ, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ప్రణయ్‌ అమృత కేసు విషయంలో గానీ, ఆంధ్రా మీదుగా తరలిస్తున్న గంజాయిని అరికట్టే విషయంలో గానీ, హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు గానీ రంగనాథ్‌ విధులు నిర్వహించిన క్రమంలో తీసుకున్న చర్యలు అందరిమన్ననలు పొందాయి. అలాంటి అధికారి కావాలని పట్టుబట్టి మరీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైడ్రా టాస్క్‌ఫోర్స్‌ బాధ్యతలను రంగనాథ్‌ భుజస్కంధాలపై ఉంచారు. ముఖ్యమంత్రి అండగా నిలిచి, అక్రమాలను నిలువరించాలని సూచించడంతోపాటు, ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడి ప్రబోధానికి తగ్గట్లుగానే అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుందని వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హైడ్రా విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించడం, అందుకనుగుణంగానే ఏవీ.రంగనాథ్‌ దూసుకు పోతుండటంతో గలాటా సృష్టించి, వీరిని అడ్డుకునేందుకు కుట్రలకు తెరలేపినట్లు తెలుస్తోంది.

సుఫారీ గ్యాంగులతో కలిసి కుట్ర.?

హైదరాబాద్‌ మహా నగరంలో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్న హైడ్రా బాస్‌పై సుఫారీ గ్యాంగులతో కలిసి కక్షసాధింపు చర్యలకు సిద్ధమవుతున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయనపై పాతబస్తీతో పాటు, పలువురు రాజకీయ, ఇతర ప్రముఖులు కుట్రలకు తెరలేపినట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇంటెలిజెన్స్‌ నిఘా వర్గాల సమాచారంతో ఏవీ.రంగనాథ్‌ఇంటి వద్ద పోలీస్‌ భద్రతను ఇప్పటికే పెంచారు. ఆయన వ్యక్తిగత భద్రతను సైతం పటిష్టం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని, నిష్కలంక అధికారిగా విశ్వాసం పొందిన అధికారులను కాపాడుకోవడంతో పాటు, వారు మరింత ఉత్సాహంగా పని చేసేలా అధికారాలను కట్టబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment