గంజాయి స్మగ్లర్లు అరెస్ట్….

గంజాయి స్మగ్లర్లు అరెస్ట్….

300 గ్రాములు ఎండు గంజాయి మూడు సెల్ ఫోన్లు స్వాధీనం నలుగురు రిమాండ్

చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో నవంబర్ 12 ప్రతినిధి

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ నరసింహ వెంచర్లో ఎండు గంజాయి అమ్ముతున్న నలుగురు వ్యక్తులని పట్టుకొని రిమాండ్ తరలిస్తున్నాము అని తూప్రాన్ డిఎస్పి వెంకటరెడ్డి తెలిపారు పోలీసుల కథనం ప్రకారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి తూప్రాన్ పట్టణంలోని లక్ష్మీనరసింహ వెంచర్లో ఎండు గంజాయి అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు తూప్రాన్ సీఐ రంగకృష్ణ ఎస్ఐ శివ నందన్ దాడి నిర్వహించి 300 గ్రాములు ఎండు గంజాయి మూడు సెల్ ఫోన్లు స్వాధనం చేసుకొని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రాఫిక్ ఆర్ట్ ప్రకారం కేసు నమోదు చేసినమని నలుగురు వ్యక్తులను తూప్రాన్ పట్టణానికి చెందిన నీలం అజయ్ శ్యామగారి లోకేష్ మామిళ్ల తరుణ్ అమిత్ అనే నలుగురు వ్యక్తులను రిమాండ్ కు తరలిస్తామని తూప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి తెలిపారు డ్రగ్స్ గంజాయి వంటి మాదకద్రవ్యాలు అమ్మిన కొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ దాడి పాల్గొన్న పోలీస్ సిబ్బందికి అభినందించారు మీడియా సమావేశంలో సిఐ రంగ కృష్ణ తూప్రాన్ ఎస్ఐ శివానందం కానిస్టేబుల్ సురేష్ కృష్ణ పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment