పెద్ద శంకరంపేట లో
వెంకటేశ్వర కాలనీ ఇంట్లో చోరీ.
ఎనిమిదిన్నర తులాల బంగారం, 30 తులాల వెండి అపహరణ.
చార్మినార్ ఎక్స్ ప్రెస్: అక్టోబర్ 29 ,పెద్ద శంకరంపేట్. పెద్ద శంకరంపేట లోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న పోలీస్ కానిస్టేబుల్ దంతెల సీమన్ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఎనిమిదిన్నర తులాల బంగారం, 30 తులాల వెండి, 15 వేల నగదు దొంగలించిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. దంతల శ్రీమన్ అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ శంకరంపేట లో వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నాడు. పెద్ద శంకరంపేట ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం దంతల సీమాన్ సోమవారం ఉదయం 9 గంటలకు ఇంటికి తాళం వేసి బయట వెళ్లిన అనంతరం మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి రాగా ఇంటిముందు ఉన్న తలుపులు వేసి వేసినట్లుగానే ఉన్నాయన్నారు. లోపల ఉన్న తలుపు తాళం పగలగొట్టి ఇంట్లోనే బెడ్ రూమ్ లోని బీరువా మొత్తం పగలగొట్టి అందులో ఉన్న బట్టలు చిందరవంతరగా పడేయడంతో పాటు మూడు తులాల బంగారం నాను, మూడు తులాల పుస్తెలతాడు, ఒక తులం బుట్ట కమ్మలు, అర తులం బంగారు కమ్మలు, 30 తులాల వెండి వస్తువులు, వీటితోపాటు 15 వేల నగదు దొంగలు దొంగలించినట్లు ఆయన వివరించారు. సంఘటన స్థలాన్ని అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి, పేట ఎస్ఐ శంకర్, పోలీసులు పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. బాధితుడు సీమాన్ దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.