బ్రేకింగ్ న్యూస్ … పెద్దపెల్లి జిల్లా చిన్న కల్వల సమీపంలోని నారాయణపూర్ ఎక్స్ రోడ్ లో భారీ యాక్సిడెంట్… ఒక మహిళ మృతి 

బ్రేకింగ్ న్యూస్ …

 

పెద్దపెల్లి జిల్లా చిన్న కల్వల సమీపంలోని నారాయణపూర్ ఎక్స్ రోడ్ లో భారీ యాక్సిడెంట్… ఒక మహిళ మృతి 

 

పెద్దపెల్లి జిల్లా చిన్నకల్వల సమీపంలోని నారాయణపూర్ ఎక్స్ రోడ్ లో భారీ యాక్సిడెంట్ శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్ స్టాప్ లో బస్సు కొరకు ఎదురుచూస్తున్న చిన్న కల్వలకు చెందిన ఒక మహిళ మృతి చెందినట్లుగా గుర్తించారు. కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపుగా వెళుతున్న ఎరువుల లారీ అతివేగంతో రావడం జరిగింది. అకస్మాత్తుగా లారీకి అడ్డు వచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో లారీ అదుపుతప్పి బోల్తా పడింది. అక్కడే ఉన్న మహిళ పైన పడడం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడగా ఒకరు మృతి చెందగా మృతురాలు చిన్నకల్వల గ్రామానికి చెందిన కలువల ఈశ్వరమ్మగా గుర్తించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment