హైదరాబాద్‌లో మరో అత్యాచార ఘటన

హైదరాబాద్‌లో మరో అత్యాచార ఘటన

ఫేస్‌బుక్ పరిచయం.. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వివాహితపై అత్యాచారం

చార్మినార్ ఎక్స్ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో ఆగస్టు 04 ప్రతినిధి

అనంతపూరం జిల్లాకు చెందిన ఓ మహిళ బెంగుళూరులో సాప్ట్‌వేర్ జాబ్ చేస్తుండగా, ఈ క్రమంలో కంపెనీలో ప్రాజెక్ట్ లేకపోవడంతో తన ఉద్యోగం కోల్పోయింది.

ఉద్యోగం కోసం ఆన్లైన్‌లో వెతుకుతున్న ఆమెకు హైదరాబాద్‌కు చెందిన నర్సింహ రెడ్డి ఫేస్‌బుక్‌లో పరిచయమై, జాబ్ ఇప్పిస్తానని తనని హైదరాబాద్‌కు పిలిపించాడు.

హైదరాబాద్‌కు కుటుంబంతో వచ్చిన ఆమె, ఇంటర్వ్యూ కోసం నర్సింహ రెడ్డికి చెందిన కీస్ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్లగా ఆమెను ఒక రూంలో బందించి అత్యాచారం చేశాడు.. నర్సింహ రెడ్డితో పాటు ఉన్న లవకుమార్ కూడా తనతో కలవాలని వేధించాడు.

దీంతో ఆమె తన భర్తకు జరిగిన విషయం చెప్పగా, అతను బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment