వివిధ రకాలుగా పోగొట్టుకున్న 1190 మొబైల్ ఫోన్లను బాధితులకు అందచేసిన క్రైమ్ డీసీపీ నరసింహ

వివిధ రకాలుగా పోగొట్టుకున్న 1190 మొబైల్ ఫోన్లను బాధితులకు అందచేసిన క్రైమ్ డీసీపీ నరసింహ

 

 

సైబరాబాద్ కమిషనరేట్ లో ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనం అయిన, మరియు వివిధ రకలుగా పోగొట్టుకున్న సుమారు రూ.2 కోట్ల 55 లక్షల విలువైన 1190ఫోన్లను సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ నరసింహ్మా శుక్రవారం బాధితులకు అప్పగించారు. వీటిలో ఐ ఫోన్లతో పాటు పలు విలువైన మొబైల్ ఫోన్లు ఉన్నాయి. కొంతమంది ఫోన్లు సంవత్సరంతరం తర్వాత దొరకబట్టగ ఇంకొన్ని నెల రోజులల వ్యవధి లో రికవరీ కావడం విశేషం. పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి పొందిన బాధితులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ క్రైమ్ డీసీపీ నరసింహ్మా మాట్లాడుతూ గతంలో చైన్ స్నాచింగ్ లు, ఇళ్లలో దొంగతనాలు జరిగేవి కానీ ఈ మధ్య కాలంలో డ్రగ్స్ కేసులు సెల్ ఫోన్ల దొంగతనాలు, సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తు చేశారు. కొన్నిసార్లు చైన్ స్నాచింగ్ లు చేస్టు అనుకోకుండా, మొబైల్ దొంగిలించడం మరికొన్ని సార్లు దొంగలు మొబైల్స్ ఫోన్లు దొంగతనలు చేస్తున్నారని అలా రోజు వ్యవధిలోనే చాలా ఫోన్లు చోరీలకు గురవుతున్నాయని అన్నారు. సైబరాబాద్ పరిధిలోని 5 సీసీఎస్ పోలీసు సిబ్బంది నిర్విరామంగా పని చేసి, వ్యయప్రయాసలకు ఓర్చి ఫోన్లను రికవరీ చేశారని, సైబరాబాద్ పరిధిలో చోరీకి గురై దేశంలో ఎక్కడెక్కడో ఉన్న ఫోన్లను తిరిగి తెప్పించామని అన్నారు.

పోలీసులు ఎప్పుడూ మన రక్షకులేనన్న ఆయన పోలీసుల మీద నెగటివ్ ఫీలింగ్ తీసేయాలని ప్రజలకు సూచించారు.  

తెలంగాణ రాష్ట్రంలోనే పోలీసులు నెంబర్ వన్ గా పనిచేస్తున్నారని ఎక్కడ నేరం జరిగినా నిందితుల అంటూ చూడటానికి సిద్ధంగా ఉన్నారని పోలీసు వ్యవస్థ సమాజంలో సత్ప్రవర్తన కల్పించేందుకు కృషి చేస్తుందని, సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. సాధ్యమైనంతవరకు ఫోన్లు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని పాత ఫోన్ల విషయం లో ఆలోచించాలని వాటినీ అసలు కొనవద్దని అన్నారు ఒక వేళ మీ దృష్టి కి దొంగ సొమ్ము అని తెలిసిన వెంటనే స్థానిక లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు నగదు లావాదేవీలు జరిపేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలని మీ చుట్టూ నిగ కెమరాలు ఉన్నాయో లేవో కూడా చూసూకోవాలని మిమ్మల్ని ఎవరైనా గమనిస్తున్నారా అనేది కూడా పరిశీలించాలని అన్నారు అదేవిధంగా మొబైల్ ఫోన్లలో కొత్తగా వస్తున్న యాప్ లతో జాగ్రత్తగాఉండాలని సైబర్ నేరాలు జరిగితే టోల్ ఫ్రీ నంబర్ 1930 కు డయల్ చెసి సమాజం లో జరుగుతున్న నెగిటివ్ అకృత్యాలకు చెక్ పెట్టే విధంగా పోలిసుల దృష్టి కి తీసుకురావాలని కోరారు ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం సమాజం లో ఉన్న మంచి వారికే గానీ ఆసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని క్రైమ్ డీసీపీ నరసింహా సృష్టం చేశారు పోగొట్టుకున్న ఫోన్ల రికవరీ కి కీలకంగా వ్యవహరించిన అధికారులను సిబ్బందిని క్రైమ్ డిసిపి నరసింహ అభినందించారు

Join WhatsApp

Join Now

Leave a Comment