గోపాలకృష్ణకు సిపిఎం, సిఐటియు నాయకుల ఘన నివాళి.
పెద్ద ఎత్తున అంతిమయాత్రలో పాల్గొన్న పండ్ల వర్తక వ్యాపారులు
భద్రాచలం:సీనియర్ సభ్యులు, పండ్ల వర్తక సంఘం (సి ఐ టి యు) భద్రాచలం పట్టణ వ్యవస్థాపకులు అమరజీవి కామ్రేడ్ జి. గోపాలకృష్ణ మృతి పార్టీకి ,కార్మికులకు తీరని లోటని సిపిఎం సీనియర్ నాయకులు జిఎస్ శంకర్రావు, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి లు అన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన కామ్రేడ్ గోపాలకృష్ణ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో వారు మాట్లాడుతూ గోపాలకృష్ణ భద్రాచలం పట్టణంలో పండ్ల వర్తక సంఘం (సిఐటియు) నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారని, సిపిఎం పార్టీ నవ తెలంగాణ శాఖకు కార్యదర్శిగా పనిచేశారని అన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ ఇచ్చిన పిలుపులను జయప్రదం చేయడంలో గోపాలకృష్ణ చురుకుగా పాల్గొనే వారని అన్నారు. పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఫుట్పాత్ వ్యాపారస్తులకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ వారికి అండగా నిలిచారని అన్నారు. ఇంకా ఈ సంతాప సభలో సిఐటియు పట్టణ నాయకులు ఎర్రంశెట్టి వెంకట రామారావు సిపిఎం సీనియర్ నాయకులు బి బి జి తిలక్, ప్రముఖ వ్యాపారవేత్త లయన్ పల్లంటి దేశప్ప లు మాట్లాడుతూ వారి సేవలను కొనియాడారు. జీకే మృతి కార్మిక వర్గ ఉద్యమానికి ,కుటుంబానికి తీరని లోటని అన్నారు. మాజీ జెడ్పిటిసి జి ప్రభావతి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగా, సిఐటియు పట్టణ నాయకులు అజయ్ కుమార్, పండ్ల వర్తక సంఘం పట్టణ అధ్యక్షులు వేల్పూరి రాము గోపాలకృష్ణ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పండ్ల వర్తక సంఘం నాయకులు నాయకులు బాలకృష్ణ, వాసు ,బాలాజీ, మోత్కూరి కృష్ణ, మరియు వ్యాపారస్తులు అందరూ అంతమ యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.