పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలి… సిపిఎం మండలం కమిటీ డిమాండ్.
శుక్రవారంఉదయం ఎంపీడీవో అశోక్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ మండల సీనియర్ నాయకులు ఐలూరి .రామిరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు అర్హత కలిగిన ప్రతి పేదవారికి ఇవ్వాలని, ఉపాధి హామీ పని 20 రోజు చేస్తేనే పథకం వర్తింప చేస్తామనడం కరెక్ట్ కాదని, క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందివ్వడం కోసం మరొకసారి ప్రభుత్వాలు సర్వే నిర్వహించాలని, అద్దె ఇళ్లలో ఉన్నవారికి కూడా పథకాలు ఇవ్వాలని లేనిపక్షంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముట్టడి చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల ఆర్గనైజర్ పెద్దిని. వేణు, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, రామడుగు వెంకటాచారి, రాయి రాజా, ఎస్.కె నాగుల్ మీరా, పార్టీ అయ్యన్నపాలెం శాఖ కార్యదర్శి చల్లపల్లి. రాజా, కంభంపాటి. కాంతారావు, p. వీరభద్రం, దాసరి. సీతారాములు, బేతి. వంశీకృష్ణ, దాసరి. క్రాంతి తదితరులు పాల్గొన్నారు..