కోడ్ తో పథకాలను ఆపేందుకు కుట్ర

కోడ్ తో పథకాలను ఆపేందుకు కుట్ర : చింత ప్రభాకర్  

 

 

— పెండింగ్ వేస్తూ ఫాండింగ్ చేసుకుంటూ ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలకు ప్రజలను దూరం చేస్తుంది : చింత ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే, సంగారెడ్డి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు 

 

— సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కలసిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు. ..

 

— గత ప్రభుత్వంలో సంగారెడ్డి, సదాశివపేట పట్టణాల అభివృద్ధికి ఎస్ డి ఎఫ్ నిధులు ద్వారా సంగారెడ్డి పట్టణానికి రూ.50 కోట్లు సదాశివపేట మున్సిపాలిటీకి రూ.25 కోట్లు మంజూరు 

 

— ప్రభుత్వం మారడంతో సంగారెడ్డి పట్టణంలో మొత్తం 53 పెండ్డింగ్ పనులకు గాను 527.50 లక్షలు, సదాశివపేట పట్టణంలో 141 పనులకు గాను 830.00 లక్షల అభివృద్ధి పనులను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. …

 

— పట్టణాల అభివృద్ధిని అడ్డుకోకుండా క్యాన్సిల్ చేసిన పనులను మరల ప్రారంభించాలి…

 

— స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ పేరుతో సంక్షేమ పథకాలను ఆపేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు… 

 

— తెలివిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది… 

 

— జనవరి 26 తరువాత రైతు భరోసా డబ్బులు ఖాతాలో పడతాయని రైతులు ఎదురు చేస్తున్నారు…ఇప్పటి వరకు రైతుల ఖాతాలో డబ్బులు జమ కాలేదు…

 

— మొన్న నాలుగు గ్యారంటీ పథకాల అమలు చేస్తామని చెప్పి.. నియోజకవర్గంలో 86 గ్రామాలు ఉంటే ఇరిగిపల్లి, చేర్యాల, కొండాపూర్, ఎల్లారం గ్రామాల్లో కూడా పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయని పరిస్థితుల్లో కాంగ్రెస్ పాలన ఉంది….

 

— కాంగ్రెస్ పాలనలో రైతులు అయోమయం… రైతు రుణమాఫీ పై స్పష్టతనివ్వని కాంగ్రెస్‌ ప్రభుత్వం….

 

—- సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రుణమాఫీ అయ్యిందని ప్రకటనలు చేస్తుంటే , జిల్లా మంత్రి పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు అని ఒప్పుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం ….

 

కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, చక్రపాణి, ఆంజనేయులు, విఠల్ మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు…

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version