సువెన్ ఫార్మాని జనవాసాలకు దూరంగా తరలించాలని రేపు కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి
కొత్తపల్లి రేణుక సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సువేన్ ఫార్మా కంపెనీపై సిట్టింగ్ జడ్జితో ఎంక్వయిరీ కమిటీ వేయించి సీజ్ చేయాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక డిమాండ్ చేశారు.ప్రస్తుతం సువెన్ ఫార్మా కంపెనీనీ జనావాసాలకు దూరంగా తరలించాలని,ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నందుకు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ రేపు సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కలక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని లెనిన్ నగర్ లో విలేఖర్ల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక మాట్లాడుతూ దొడ్డిదారుల్లో అనుమతులు పొంది తప్పుడు విధానాలతో గత 30 సంవత్సరాల నుండి సెవెన్ ఫార్మా కంపెనీ నడిపిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనీ అన్నారు. గతంలో అనేకసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోకుండా మీనా వేషాలు వేస్తూ,అధికారులు ప్రభుత్వంలో ఉన్నవాళ్లు వారిచ్చే తాయిలాలకు అలవాటు పడి చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అన్నారు. దీనిపై మా పార్టీ మరియు ఇతర ప్రజా సంఘాల వాళ్ళు గతంలో ఉన్న కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన ఈరోజు వరకు ఈ ఫ్యాక్టరీ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు కావున కలెక్టర్ గారు స్పందించి సిటింగ్ జడ్జితో ఎంక్వయిరీ కమిటీ వేయించి ఫ్యాక్టరీని సీజ్ చేయించాలని లేదా జనావాసాలకు దూరంగా తరలించాలని కోరుతూన్నాం. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నందుకు చట్టారీత్యా సువెన్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రేపు కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్,పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షులు మారసాని చంద్రకళ, జిల్లా సహయ కార్యదర్శి సంతోషి మాతా, కోశాధికారి జయమ్మ, వీరబాబు, జానయ్య,సురేష్, పద్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు.