కాంగ్రెస్ పాలన తీరు మార్చుకోవాలి…కాంగ్రెస్ పాలన తెలంగాణను డ్యామేజ్ చేసే విధంగా ఉంది: చింతా ప్రభాకర్

కాంగ్రెస్ పాలన తీరు మార్చుకోవాలి…కాంగ్రెస్ పాలన తెలంగాణను డ్యామేజ్ చేసే విధంగా ఉంది: చింతా ప్రభాకర్

 

 

బిఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ శ్రేణులు…

 

రాష్ట్రంలో 420 కాంగ్రెస్ పాలన మోసాలపై సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో కూడిన వినతి పత్రాన్ని బిఆర్ఎస్ శ్రేణులు తో కలిసి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సమర్పించారు…  

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ … 

 

అమలు గాని 6గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ ఆరు గ్యారెంటీలను 420 హామీలను ఎగ్గొట్టి ప్రయత్నం చేస్తుంది…. కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుంది… 

 

మొన్న జరిగిన నాలుగు గ్యారంటీ పథకాల అమలు చేస్తామని చెప్పి.. నియోజకవర్గంలో 86 గ్రామాలు ఉంటే నాలుగు గ్రామాల్లో కూడా పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయని పరిస్థితుల్లో కాంగ్రెస్ పాలన ఉంది….

 

అమలు గాని హామీలు ఇచ్చి రోజుకో అబద్ధం ఆడుతూ.. ఏతుల రేవంత్ రెడ్డి గా సీఎం రేవంత్ రెడ్డి పేరుపొందుతున్నాడు…  

 

రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి , లేని పక్షాన బిఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం… 

 

 కాంగ్రెస్ ప్రభుత్వానికి సద్బుద్ధి , మంచి ఆలోచనతో పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆ మహాత్మా గాంధీకి వినతి పత్రం సమర్పించాం… 

 

కాంగ్రెస్ పాలన తీరు మార్చుకోవాలి… కాంగ్రెస్ పాలన తెలంగాణ ను డ్యామేజ్ చేసే విధంగా ఉంది… 

 

కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, టియన్జియోస్ మాజీ అధ్యక్షులు మామిళ్ళ రాజేందర్, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, మందుల వరలక్ష్మి, డాక్టర్ శ్రీహరి, కొండల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి ,మధుసూదన్ రెడ్డి, వివిధ మండలాల మాజీ సర్పంచులు,మాజీ కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నేతలు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment