మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించిన కలెక్టర్

మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించిన కలెక్టర్

 

 

మక్తల్ నియోజక వర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని మంగళ వారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారుఈ నెల 22 న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మక్తల్ మండలంలోని కాచ్ వార్ గ్రామంలో జరిగే ప్రజా పాలన గ్రామ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రిని మంత్రి సందర్శించనున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ మక్తల్ ఆస్పత్రిని పరిశీలించి అక్కడ ఏర్పాటు చేయబోయే డయాలసిస్ సెంటర్ కేంద్రంలో అవసరమైన పరికరాలు బెడ్లు ఇతర వసతి సౌకర్యాల గురించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ సౌభాగ్య లక్ష్మి ఆస్పత్రి సమన్వయకర్త డాక్టర్ మల్లికార్జున్ తో చర్చించి తగు సూచనలు చేశారు అనంతరం ఆస్పత్రిలోని ప్రసూతి వార్డును, లేబర్ రూమ్ ను పరిశీలించారు అనంతరం ఇన్ పేషెంట్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను మాట్లాడారు వైద్య సేవల ఎలాఅందుతున్నాయనిఆరాతీశారుకాగాఅంతకుముందు కలెక్టర్ మక్తల్ శివారులోని సర్వే నంబర్ 916/2 917/2 సర్వే నంబర్ లలో 150 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదించిన 10 ఎకరాల స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరితో కలిసి పరిశీలించారు. ఆ స్థలాన్ని బుధవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరిశిలిస్తారని ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి తెలిపారు. పట్టణానికి సమీపంలో అంతటి అనువైన స్థలం ఇంకెక్కడా లేదని, నలువైపులా రహదారి సౌకర్యం కూడా ఉందని ఎమ్మెల్యే చెప్పారు నీటి పారుదల శాఖ కు సంబందించిన ఆ స్థలానికి అవసరమైన అనుమతులు కూడా తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. రివైజ్ ఎస్టిమేట్ ప్రకారం రూ.46 కోట్లతో 150 పడకల ఆసుపత్రి తో పాటు నర్సింగ్ కాలేజ్ ను కూడా ఇదే స్థలంలో నిర్మించేందుకు ప్రతిపాదినట్లు ఎమ్మెల్యే వివరించారు.ఈ విషయమై ఆరోగ్య శాఖ మంత్రి తో హామీ,అనుమతి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఆస్పత్రి నిర్మాణానికి టెండర్, అగ్రిమెంట్ కుడా పూర్తయిందని ఎమ్మెల్యే తెలపగా ఎన్ని బ్లాకుల్లో ఆస్పత్రి భవనం నిర్మాణం చేపడతారని జిల్లా కలెక్టర్ టీజీ ఎంఐడిసి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 5 బ్లాకుల్లో నిర్మించే ఆస్పత్రి భవన నిర్మాణ ప్లాన్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సతీష్ కుమార్ మక్తల్ మున్సిపల్ కమిషనర్ భోగీశ్వర్ ఆర్. ఐ. రాములు, సర్వేయర్, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version