చైనా మాంజా నిషేధం
రాయికోడ్ ఎస్ ఐ నారాయణ
సంక్రాంతి పండగ వచ్చిందంటే గాలిపటాలతో చిన్నపిల్లలు చిందులు వేస్తూ గాలిపటాలను ఎగరవేస్తూ ఉంటారని రాయికోడ్ సబ్ ఇన్స్పెక్టర్ నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాలిపటాలకు మాంజాతో పాటు చైనా మాంజాను వాడుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ చైనా మాంజాను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన ఈ గాలిపటాలు అమ్మేవారు సైతం చాటు మార్గాన పిల్లలకు అమ్ముతూ మనుషులతో పాటు పక్షుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మండల పరిధిలోని అన్ని దుకాణాల్లో చైనా మాంజా విక్రయాలు చేయరాదని, జిల్లా ఎస్పీ సంగారెడ్డి ఆదేశాల మేరకు చైనా మాంజాను అరికట్టేందుకు ప్రతి షాపును తనిఖీలు నిర్వహించి చైనా మాంజా కనబడితే సీజ్ చేసి వారు మళ్లీ షాప్ పెట్టకుండా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.