సి డి ఆర్ వాలీబాల్ టోర్నమెంట్
క్రీడాకారులు సద్వినియొగం చేసుకోవాలి
వట్పల్లి మండలంలోని బిజిలిపూర్ గ్రామంలో ఉమ్మడి మెదక్ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లింగాయత్ రాష్ట్ర బలిజ సంఘం అధ్యక్షులు పట్లోళ్ల సంగమేశ్వర్ మరియు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వట్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దిగంబరావ్, బిజిలి పూర్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ మాధవి, మాజీ ఎంపిటిసిలు శంకరప్ప, సంగప్ప వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశం సద్వినియొగం చేసుకోవాలని, మొదటి ప్రైజ్ 20,111 రెండవ బహుమతి 10,111 ఉన్నట్లు తెలిపారు. డ్రా 15 వ తేదీ నాడు తిబడునని పేర్కొన్నారు.