పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో అభివృద్ధి పనుల కొరకు నిధుల మంజూరు చేయాలని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి కలిసిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్……

పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో అభివృద్ధి పనుల కొరకు నిధుల మంజూరు చేయాలని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి కలిసిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్……

 

పటాన్చెరువు డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో అభివృద్ధి పనుల కొరకు నిధులు మంజూరు చేయాలని ఈ రోజు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి వారి మరియు SE శంకర్ నాయక్ గారిని కార్యాలయంలో కలవడం జరిగింది.

 

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో సరైన లైట్లు లేనందువల్ల పాదచారులు, వాహనదారులు రాత్రి పూట చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు, ఆల్విన్ కాలనీ నుండి సింఫనీ కాలనీ వరకు అక్టాగొనల్ విద్యుత్ స్తంభాలతో పాటు అధునాతన లైట్లను అమర్చాలని కోరారు. అలాగే పలు చోట్ల 20 నూతన హై మాస్ట్ లైట్లను అమార్చాలని కోరారు.

 

పటాన్చెరువు వద్ద జాతీయ రహదారి రోడ్డు వెడల్పు మంజురైనందున రోడ్డు వెడల్పు పనులు శరవేగంగా జరుగుతున్నాయి కాగా పాత విద్యుత్ స్తంభాలు రోడ్డు వెడల్పు వల్ల రోడ్డు మధ్యలో వస్తున్నాయి కావున పాత స్తంభాలను తొలగించి నూతన స్తంభాలను కాలనీవాసులకు అందుబాటులో ఉండేలాగా లోపలికి వేయాలని కోరారు. ఇందుకు జోనల్ కమిషనర్ 

ఉపేందర్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా చేస్తామని చెప్పడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version