కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బడ్జెట్ కు నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో బడ్జెట్ కాపీల దగ్ధం..

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బడ్జెట్ కు నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో బడ్జెట్ కాపీల దగ్ధం..

 

కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2025 -26 కేంద్ర బడ్జెట్ లో పేదలకు. రైతులకు. అసంఘటితరంగ కార్మికులకు. విద్యా వైద్య రంగాలకు. తీవ్రమైన నష్టం జరిగింది వివిధ రంగాలకు నిధులు కేటాయించటంలో వైఫల్యం జరిగిందని. ఈ బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు సంపన్నులకు పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా ఉందని సీపీఎం మరిపెడ మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ అన్నారు .ఈరోజు బస్సు స్టాండ్ సెంటర్ లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసనగా బడ్జెట్ కాపీలను దగ్ధం చేయటం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ 2025 -26 సంవత్సరాల గాను 50 లక్షల 65 345 కోట్లు కేటాయించినట్లు కనబడుతున్న. సామాన్య ప్రజలకు ఆహార భద్రత విధానానికి విద్య వైద్య రంగాలకు తగ్గింపులు కనపడుతున్నాయని అన్నారు. కేటాయించిన బడ్జెట్ కూడా పూర్తిగా అమలు చేయడం లేదని గతంలో పట్టణాల అభివృద్ధి కోసం 30 వేల కోట్ల రూపాయలు 2024 బడ్జెట్లో కేటాయించగా కేవలం 14 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ప్రధాన రంగాలైన వ్యవసాయ రంగం దానిమీద ఆధారపడి పనిచేస్తున్న వ్యవసాయ కూలీలకు ఈ బడ్జెట్లో రెండు లక్షల 5 వేల కోట్లు కేటాయించాల్సిన అవసరం ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం 86 వేల కోట్లు మాత్రమే కేటాయించారు దానిలో 25 వేల కోట్లు పాత బకాయిలు ఉన్నాయి .200 రోజులు పని కల్పించాల్సింది గాను కేవలం 60 -70 రోజులు మాత్రమే కొనసాగుతున్నది. రోజుకి 600 రూపాయలు చొప్పున కూలి వేతనం ఇవ్వాల్సింది ప్రస్తుతం 150 రూపాయలు 200 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. దేశంలో 45 కోట్ల మంది ఉపాధి కార్మికులు ఉన్నారని వారి జీవన అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధికి ఈ బడ్జెట్ తోడ్పడే విధంగా లేదని అన్నారు. వ్యవసాయ రంగంపై 65 శాతం దేశం ఆధారపడి ఉన్నది దేశ సంపదకు 16% వ్యవసాయరంగం ద్వారానే ఆదాయం వస్తుంది కానీ నిధులు కేవలం 1,71, 437 కోట్లు కేటాయించటం అత్యంత దారుణం వ్యవసాయ రంగాన్ని కుదించారు అన్నారు . మరోవైపు విద్యారంగానికి కేవలం 1,28,000 కోట్లు కేటాయించటం ఆరోగ్య రంగానికి 98,311 కోట్లు కేటాయించడం ఈ రంగాలపై ప్రభుత్వ చిన్న చూపు కనపడుతుంది విద్యా వైద్యం కార్పొరేట్ ప్రైవేటీకరణ అవుతున్నది. సందర్భంగా బడ్జెట్లో పది శాతం నిధులు కేటాయించాల్సిన విద్యారంగానికి కేవలం ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే కేటాయించడం జరిగింది. సామాజిక రంగాల అభివృద్ధికి నిర్మాణం మంచినీటి సౌకర్యం గ్రామీణ పాండవులు మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులను కేటాయించడంలో వైఫల్యం జరిగింది మరోవైపు కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలని 15 లక్షల కోట్ల ఆదాయం వచ్చే వాటిని కట్టబెడుతున్నారు

 కార్పొరేట్ శక్తులు పది లక్షల కోట్ల పైన బకాయిలు వివిధ బ్యాంకులలో అప్పులు ఉన్నారు వారిని వసూల్ చేయాల్సిన ప్రభుత్వం అవి రద్దు చేయటం దుర్మార్గమైన చర్య సంపన్నులపై 30% పైగా పన్ను వేయాలి కానీ 20% మాత్రమే పన్ను విధిస్తున్నారు మరో ప్రజలపై 35 శాతం పన్నులు వేస్తున్నారు ఎల్ఐసి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఆదాయంలో ఉంటూ కోట్లాదిమందికి అభివృద్ధికి దోహదం చేస్తున్న ఈ రంగంలో 100% ప్రైవేట్ పెట్టుబడులు సంస్థలు తీసుకురావాలని. 100% పెట్టుబడులు ఎఫ్డిఐలకు అనుమతిని ఇచ్చింది ఈ తప్పుడు విధానం కారణంగా ప్రభుత్వ రంగ ఎల్ఐసి దెబ్బతింటుంది లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉన్నది దేశ సమైక్యతకు సార్వభౌమాధికారానికి భంగం కలిగించే చర్యని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మరిపెడ మండల నాయకులు బోడపట్ల రాజశేఖర్, కందాల రమేష్, దొంతు మమత, కొండఉప్పలయ్య,దొంతు సోమన్న, భయ పాపారావు, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment