బ్యాట్మెంటన్ రాష్ట్రస్థాయి పోటీలకు బ్రహ్మంగారి మఠం మండల క్రీడాకారుడు

బ్యాట్మెంటన్ రాష్ట్రస్థాయి పోటీలకు బ్రహ్మంగారి మఠం మండల క్రీడాకారుడు

ఉమ్మడి కడప జిల్లా స్థాయి 35 ప్లస్ బ్యాట్మెంటన్ డబుల్స్ విభాగంలో బ్రహ్మంగారి మఠం మండల టౌన్ పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన సూర్య ధన్య మోహన్,కడప వాసి లోకేష్ లు విన్నర్ లు గా నిలిచారు. ఉమ్మడి కడప జిల్లా స్థాయి మాస్టర్స్ బ్యాట్మెంటన్ పోటిలు ఆదివారం కడప మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు.35 సంవత్సరాలు పైబడిన క్రీడాకారులను మొదలుకొని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక విభాగము చొప్పున 65 సంవత్సరాలు పైబడిన క్రీడాకారులకు ఈ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. పురుషులకు, మహిళలకు సింగిల్స్, డబల్ సందు విడివిడిగా పోటీలను నిర్వహించి జిల్లా జట్ను ఎంపిక చేసినట్లు టోర్నమెంట్ రెఫ్రీ జిలాని భాషా తెలిపారు.ప్రతి విభాగములో విన్నర్, రన్నర్ గా నిలిచిన జట్టు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనుటకు అర్హత సాధించారని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలు ఫిబ్రవరి సెకండ్ వీక్ లో విజయవాడలో నిర్వహిస్తారని తెలిపారు. బ్రహ్మంగారి మఠం మండలం నుండి జిల్లా స్థాయిలో చక్కటి ప్రతిభ చూపి విజేతలుగా నిలబడి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల మండల వాసులు క్రీడాకారుడు సూర్య ధన్య మోహన్ కు అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version