సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ ఆశయ సాధనకు ప్రతి పౌరుడు పాటు పడాలి ఏబీవీపీ నగర అధ్యక్షులు ఆంజనేయ రెడ్డిప్రముఖ భారత స్వాతంత్ర్య సమరయోధుడు,రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాపు వెన్నులో వణుకు పుట్టించిన గొప్ప ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఏబీవీపీ మక్తల్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏబీవీపీ పూర్వ నాయకులు కొండయ్య , రఘుప్రసన్న భట్ , ప్రతాప్ రెడ్డి పాల్గొని నేతాజీ జయంతి సందర్భంగా నేతాజీ, స్వామి వివేకానంద ,భరతమాత చిత్రపటాలకు పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఏబీవీపీ మఖ్తల్ నగర అధ్యక్షులు శ్రీ అంజనేయ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రపంచానికే ఒక నూతన పోరాట పటిమ నేర్పించిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు,పరిపాలనదక్షుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. స్వాతంత్ర అనంతరం వారు జీవించి ఉన్నట్లయితే నేటి భారతదేశ స్వరూపం వేరేలా ఉండేదని అన్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమని విర్రవీగిన శత్రువుల వెన్నుల్లో వణుకు పుట్టించిన గొప్ప ధీశాలి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని జయంతి తప్ప వర్ధంతి లేని అమరవీరుడని అన్నారు. అలాంటి గొప్ప యోధుని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్క భారతీయుడు కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. 2025 జాతీయ సైనిక దినోత్సవం సందర్భంగా *డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్* అని పిలుపునిచ్చిన నేషనల్ ఆర్మీ సైతం నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పిన నేతాజీ పిలుపును స్ఫూర్తివంతంగా తీసుకుని దేశానికి సేవ చేస్తున్నారని తెలియజేశారు. అలాంటి నేతాజీ జయంతి సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం నిజంగా ఆనందంగా ఉందని రక్త దానం చేసిన ప్రతి ఒక్కరికి మనస్పూర్తిగా అభినందిస్తున్నామని అన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి బ్లడ్ డొనేషన్ సర్టిఫికెట్స్ అందజేశారు కార్యక్రమంలో వంశీ,వినయ్ , సందీప్ , నాని ,రాకేష్ , ప్రతాప్ రెడ్డి , సుకన్యశేఖర్ , కుర్మయ్య ఆచార్య , రాజా గౌడ్ ,మహేష్ సాగర్ , విద్యార్థులు మరియు వివిధ క్షేత్రాల కార్యకర్తలు పాల్గొన్నారు