బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మక్తల్ అంబేద్కర్ చౌరస్తాలో బెహన్జి మాయావతి జయంతి
బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మక్తల్ నియోజకవర్గం లోని అంబేద్కర్ చౌరస్తాలో భావి ప్రధాని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిబహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి గా రి 69వ జన్మదిన కార్యక్ర. మాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
మక్తల్ అసెంబ్లీ ఇంచార్జ్ పాలెం వెంకటయ్య అసెంబ్లీ అధ్యక్షులు గువ్వల తిరుపతి మండల అధ్యక్షులు పరుశురాం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పాలెం వెంకటయ్య మాట్లాడుతూ మాయావతి గారు 1956 జనవరి 15న ఢిల్లీలో జన్మించడం జరిగింది ఈమె తండ్రి ప్రభుదాస్ పోస్ట్ ఆఫీస్ లో పనిచేసేవారు ఈమె ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించడం జరిగిందన్నారు. ఈమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత సివిల్ సర్వీస్ కోసం శిక్షణ పొందుతున్న సమయంలో మాన్యవర్ కాన్సిరాం గారు మాయావతి గారి ఇంటికి వెళ్లి మీరు అత్యున్నతమైన పదవులను చేపట్టాలని మీతోనే సివిల్ సర్వెంట్లు పనిచేయాలని అందుకు మీరు బహుజన్ సమాజ్ పార్టీలో చేరాలని ఉన్నారు. ఆమె దీనికి సరేనని కాన్సిరాం గారితో కలిసి నడిచారు. మాయావతి గారు బహుజన సమాజ్ పార్టీ నుంచి నాలుగు సార్లు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగారు. బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా నాలుగు సార్లు కొనసాగుతూ ఉన్నారు. మాయావతి గారు భారతదేశంలోని ఒక శక్తివంతమైన మహిళగా ఎదిగారు. అతి చిన్న వయసులోనే దళిత ముఖ్యమంత్రిగా ఈమె పని చేశారు. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నిరుపేదలకు భూమి లేని వారికి ఒక ఎకరా భూమిని పంచారు. పీడిత కులాల ఐక్యతే లక్ష్యంగా బహుజన రాజ్యాధికారం కోసం పనిచేస్తూ బహుజన్ సమాజ్ పార్టీని ముందుకు కొనసాగిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బండారి చంద్రశేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ జిల్లా మాజీ అధ్యక్షులు వాకిటి ఆంజనేయులు ముదిరాజ్ అసెంబ్లీ అధ్యక్షులు గువ్వల తిరుపతి అసెంబ్లీ నాయకులు దేవర కృష్ణయ్య ముదిరాజ్ మక్తల్ మండల అధ్యక్షులు పరశురాం మాగనూరు మండల అధ్యక్షులు నేరేటి మల్లికార్జున్ మరియు లక్ష్మణ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు