జాతీయ బీసీ సంక్షేమ సంఘం సౌదీ అరేబియా ఇన్చార్జ్ గా గడ్డం రమేష్

జాతీయ బీసీ సంక్షేమ సంఘం సౌదీ అరేబియా ఇన్చార్జ్ గా గడ్డం రమేష్

 

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో జిల్లా అధ్యక్షులు మ్యాకల పర్శరాములు ఆధ్వర్యంలో కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా దేశ ఇన్చార్జ్ గా చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన గడ్డం రమేష్ (చంటి )ని నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మ్యాకల పర్శరాములు మాట్లాడుతూ,ఉపాధి అవకాశాల కోసం కుటుంబాలను వదిలి సౌదీ అరేబియాలో ఉన్న బీసీలను ఐక్యం చేసి,వారికి ఏ సమస్య వచ్చినా ముందుండి సమస్య పరిష్కరిస్తామని, వారికి అందుబాటులో ఉండేందుకు సౌదీ అరేబియా లో విధులు నిర్వర్తిస్తున్న గడ్డం రమేష్ ను గురువారం నియమించామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు బిల్ల వాణి , జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్, జిల్లా మండల ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్, గ్రామ అధ్యక్షులు చర్లపల్లి మహేష్, ప్రధాన కార్యదర్శి అందాస్ రమేష్, ఉపాధ్యక్షులు గడ్డం పెద్దరాజు, భూతల రాకేష్, కార్యదర్శి టేకుమట్ల ఎల్లయ్య, మేకల ఎల్లయ్య, అధికార ప్రతినిధి తూపతి పరుశరాం, కోశాధికారి గడ్డం నరేష్,సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం శ్రీకాంత్, గౌరవ సలహాదారులు గొల్లపల్లి లింగా గౌడ్, వరికెల ముకుంధామ్, కార్యవర్గ సభ్యులు అమరబండ శ్రీకాంత్, అమరబండ జలంధర్, వేముల శ్రీనివాస్,తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment