న్యాయసేవాదికార సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం
సోమవారం పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట్ గ్రామంలో జిల్లా న్యాయసేవాదికార సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వప్న రాణి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి గురించిన అనేక విషయాల గురించి, తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి, అందుబాటులో ఉన్న వైద్య విధానం గురించి, సలహాలు సూచన కొరకు సంప్రదించాల్సిన విధానం గురించి తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా న్యాయసేవాదికార సంస్థ సెక్రటరీ మేడం స్వప్న రాణి, శ్రీనివాస్ చీఫ్ లీగల్ ఎయిడ్, పంచాయతీ కార్యదర్శి తిరుపతి, రెండవ ఏఎన్ఎం సిహెచ్ జ్యోతి, అడ్వకేట్ శరత్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.