నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడి నియామకం

నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడి నియామకం

 

 

 

 

 

చందుర్తి మండల నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నికలను నిర్వహించడం జరిగిందని ,ఈ నూతన ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు గొట్టే మనోహర్, ఎండీ అజీమ్ ల సమక్షంలో అధ్యక్షుడిగా లింగాల లింగయ్య (సూర్య విలేకరి) ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడి తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందనీ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై సమష్టిగా పోరాడుతూ హక్కులను సాధించు కోవాలని చందుర్తి మండల ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లింగాల లింగయ్య అన్నారు. జర్నలిస్టుల సమస్యల కోసం అహర్నిశలు పాటుపడతానని, ఏ సమస్య వచ్చినా వారి కోసం ముందుండి పని చేస్తానని, జర్నలిస్టులు అందరూ ప్రజల సమస్యల కోసం ముందుండి పనిచేయాలని ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి చేరవేసే విధంగా పనిచేయాలని ఆయన అన్నారు. అలాగే అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు ఇప్పించేందుకు కృషి చేస్తానని, ఇళ్ల స్థలాల కోసం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన అన్నారు.ఉపాధ్యక్షుడిగా ఏనుగుల కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా రాజూరి విష్ణు కుమార్, సంయుక్త కార్యదర్శి, బొట్లవర్ శ్రీనివాస్, కోశాధికారిగా లింగాల తిరుమల్, ప్రచార కార్యదర్శి మేడిశెట్టి మధు, కార్యవర్గ సభ్యులు, మ్యాకల కొమురయ్య,మర్రి నిశాంత్,నక్క యాకోబ్,కొడగంటి గంగాధర్,రాజూరి సద్గుణ చారి, వంకాయల కార్తీక్, రాజూరి రఘురాం, మొయినుద్దీన్ , కృష్ణ వీరిని ఎన్నుకోవడం జరిగింది. వీరిని గౌరవ అధ్యక్షులు,అధ్యక్షులను శాలువాతో సన్మానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment